అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amazon Price History | తన కస్టమర్ల కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రైస్ హిస్టరీ పేరిట కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మనం కొనుగోలు చేయాల్సిన వస్తువు దర గత 90 రోజుల్లో ఎలా ఉందో యాప్‌లోనే తెలుసుకోవచ్చు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈ కామర్స్ సైట్ల (E-commerce Sites) లో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మహా నగరాల నుంచి మొదలు పెడితే మారుమూల గ్రామాల వరకు కూడా ఆయా సంస్థలు వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆన్లైన్ షాపింగ్ (Online Shopping)కు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ కామర్స్ సంస్థలు డిస్కౌంట్లు, ఆఫర్ల పేరిట మోసం చేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేక సేల్స్ సమయంలో వస్తువుల ధరలు పెంచి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు చూపుతాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెజాన్ ప్రైస్ హిస్టరీ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
Amazon Price History | చాలా ఉపయోగం
ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు వస్తువుల ధరలను తెలుసుకోవడానికి ఇతర వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారి కోసం అమెజాన్ యాప్ (Amazon App) లోనే తాజాగా ఫీచర్ తీసుకొచ్చింది. దీనిద్వారా గత 30-90 రోజుల్లో ఒక వస్తువు ధర ఎంత తగ్గింది, ఎంత పెరిగిందనే వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యం సేల్స్ సమయాల్లో బాగా ఉపయోగపడుతుందని కస్టమర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వస్తువలు ధరల హిస్టరీ తెలుసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్‌లు, వెబ్సైట్లు అవసరం లేకుండా అమెజాన్ ‘ప్రైస్ హిస్టరీ’ (Price History) ప్రవేశ పెట్టింది. మనం ఏదైనా వస్తువును సెలెక్ట్ చేస్తే కింద దాని రేటు ఉంటుంది. దాని పక్కనే ప్రైస్ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తుంది
