Gold | రూ.పది కోట్లతో బంగారం వ్యాపారి పరార్​
Gold | రూ.పది కోట్లతో బంగారం వ్యాపారి పరార్​

అక్షరటుడే, ఆర్మూర్ : Gold | హోల్​సేల్​గా బంగారం gold విక్రయించే ఓ వ్యాపారి 15 రోజులుగా కనబడటం లేదు. దీంతో ఆయనకు బంగారం కోసం డబ్బులు ఇచ్చిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు పది కోట్లతో సదరు వ్యాపారి పరారైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఆర్మూర్​ Armoor పట్టణానికి చెందిన ఓ వ్యాపారి హోల్​సేల్​గా బంగారం దుకాణాలకు Gold Shops పసిడి విక్రయించేవాడు. మార్కెట్​ ధర కంటే తులానికి రూ.1500 నుంచి రూ.2 వేల తక్కువగా గోల్డ్​ అమ్మేవాడు. ఇలా కొన్నేళ్లుగా బంగారం విక్రయిస్తున్న అతగాడు.. 15 రోజుల నుంచి కనబడకుండా పోవడం చర్చనీయాంశం అయింది.

సదరు వ్యాపారిని నమ్మి ఆర్మూర్ పట్టణంలోని వివిధ నగల వ్యాపారులు traders కోట్ల రూపాయలు బంగారం కొనుగోలుకు ముట్టచెప్పినట్లు సమాచారం. ఓ వ్యాపారి 60 తులాల బంగారం కోసం నగదు చెల్లించగా, మరో వ్యాపారి ఏకంగా కిలో బంగారానికి రూ.కోటి వరకు ముట్ట చెప్పినట్లు తెలిసింది. పదుల సంఖ్యలో వ్యాపారులు 20 తులాల నుంచి 40తులాల వరకు బంగారం కోసం డబ్బులు ముట్టజెప్పారు. ఇలా మొత్తం రూ.10 కోట్ల పైన వసూలు చేసి వ్యాపారి కనిపించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.