Gold price | మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ప‌సిడి ప్రియులు ఆల‌స్యం చేయ‌కండి..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold price | భారతీయులకు బంగారం అంటే ప‌డిచ‌చ్చిపోతారు. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు(Gold jewelry) కొనుగోలు చేసి ధరించేందుకు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. బంగారం అంటే కేవలం అలంకరణకే కాకుండా.. మంచి పెట్టుబడి సాధనంగానూ ఉప‌యోగిస్తున్నారు. ఈ ఏడాదిలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine war), అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం(US-China trade war), భారత్- పాకిస్థాన్ Pakistan ఉద్రిక్తతలు ఇలా పలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారం సురక్షిత […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold price | భారతీయులకు బంగారం అంటే ప‌డిచ‌చ్చిపోతారు. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు(Gold jewelry) కొనుగోలు చేసి ధరించేందుకు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. బంగారం అంటే కేవలం అలంకరణకే కాకుండా.. మంచి పెట్టుబడి సాధనంగానూ ఉప‌యోగిస్తున్నారు. ఈ ఏడాదిలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine war), అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం(US-China trade war), భారత్- పాకిస్థాన్ Pakistan ఉద్రిక్తతలు ఇలా పలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి.. అదే స్థాయిలో రేట్లు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగా.. బంగారం ధరలు పతనం అవుతున్నాయి. గత వారం 10 రోజుల్లో భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు మళ్లీ గత శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి.

Gold price | నిలకడగా బంగారం ధర..

మే 19, 2025 నాటికి భారతదేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం gold rates today may 19th 2025) పట్టాయి. రెండు వారాల క్రితం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర 98 వేల స్థాయిలో ఉండగా, ప్రస్తుతం మాత్రం రూ.95 వేలకు వచ్చేసింది. నేడు ఉదయం 6.30 గంటల నాటికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.95,120గా నమోదైంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 87,190గా కలదు. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.95,270 కాగా, 22 క్యారెట్ పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 87,340గా ఉంది

ఇక వెండి ధరల(Silver price) విషయానికి వస్తే ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కేజీ వెండి ధర నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గిపోయి రూ.1,06,900 స్థాయికి చేరుకుంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.96,900 కాగా, బెంగళూరు, పూణే, వడోదరా, ముంబై ప్రాంతాల్లో కూడా రూ.96,900 స్థాయిలోనే ఉంది. అంతకుముందు వరుసగా రూ. 1,000 చొప్పున 3 రోజులు తగ్గాయి. ఇక బంగారం, వెండి ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు, ఇతర అంశాల కారణంగానే ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పొచ్చు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...