అక్షరటుడే, కామారెడ్డి: Gold rates | మహిళలు అత్యంత ఇష్టంగా బంగారం కొనుక్కునే పరిస్థితి చేయి దాటిపోతోంది. గత నాలుగైదు రోజులుగా రూ.1.45 లక్షల వద్ద స్థిరంగా ఉన్న బంగారం ధరలు (Gold rates) ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
Gold rates | మంగళవారం మధ్యాహ్నం..
ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రూ.1,50,800 ఉన్న బంగారం ధర సాయంత్రానికి రూ.1.53 లక్షలకు చేరింది. దాంతో ప్రజలు బంగారం దుకాణాల (gold shops) వైపు వెళ్లాలంటే జంకుతున్నారు. వచ్చేనెలలో పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పెళ్లికి నెల ముందే బంగారం కొనుగోలు చేసి ఆభరణాలు చేయించుకోవాలని అనుకునేవారికి పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మున్ముందు పసిడి ధరలు మరింత పెరిగితే సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Gold rates | అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో..
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకునే ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump పలు ఐరోపా దేశాలపై సుంకం విధించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్‌పై పడింది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపడడంతో బంగారం, వెండి రేట్లు పరుగులు పెడుతున్నాయి.