Homeబిజినెస్​Today Gold Prices | ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధ‌ర‌.. రూ.1.30 ల‌క్ష‌ల‌కి చేరువ‌లో గోల్డ్,...

Today Gold Prices | ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధ‌ర‌.. రూ.1.30 ల‌క్ష‌ల‌కి చేరువ‌లో గోల్డ్, వెండి సైతం పైపైకి..!

Today Gold Prices | బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుపై అంచనాలు, గ్లోబల్ ఆర్థిక అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

నిపుణుల ప్రకారం, అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుపై అంచనాలు, అలాగే గ్లోబల్ ఆర్థిక అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు.

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silver Prices రోజురోజుకు పీక్స్‌కి చేరుకుంటున్నాయి . ప్రస్తుతం తులం బంగారం ధర లక్షా 30 వేల రూపాయల మార్క్‌ను దాటగా, రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెట్టుబడిదారులలో బంగారం, వెండి అత్యంత విశ్వసనీయమైన, సురక్షితమైన పెట్టుబడులుగా పరిగణించబడుతున్నాయి.

గురువారం దేశంలో బంగారం ధరలు భారీ ఎగబాకి, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్ ఇండియా (MCX)లో కొత్త రికార్డును నమోదు చేశాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,000 దాటుతూ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.

Today Gold Prices | ధ‌ర‌లు పైపైకి..

అమెరికా–చైనా China వాణిజ్య ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు అవుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

అక్టోబర్‌ 16 నాటికి దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,660గా నమోదైంది.

వెండి ధర కూడా పీక్స్‌కి చేరుకుంది. కిలో వెండి రూ.1,90,100 కాగా, హైదరాబాద్‌, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,07,100కి చేరుకుంది.

అంటే కిలో వెండి రెండు లక్షల రూపాయల మార్క్‌ను అధిగమించింది. మార్కెట్ నిపుణుల ప్రకారం, రానున్న వారాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే రేంజ్‌లో కొనసాగుతున్నాయి.