Homeబిజినెస్​Today Gold Prices | భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. జంకుతున్న మ‌హిళ‌లు

Today Gold Prices | భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. జంకుతున్న మ‌హిళ‌లు

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులకి అందనంత స్థాయికి చేరుతున్నాయి. తులం బంగారం లక్షన్నర మార్క్ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,000 ను దాటి, చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును సృష్టించింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులకి అందనంత స్థాయికి చేరుతున్నాయి. తులం బంగారం లక్షన్నర మార్క్ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,000 ను దాటి, చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును సృష్టించింది.

బంగారం ధరలు Gold Price నిత్యం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,030 కి చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,11,860 కి పెరిగింది.

పసిడి ధరలు సామాన్యులకు అందనంతగా పెరగడంతో ఆభరణాల కొనుగోళ్లు కష్టతరమవుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరలను మరింత ఎగబాకేలా చేస్తున్నాయి.

అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి, అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ భయం, జపాన్‌లో బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం వంటి అంశాలు బంగారం విలువను పెంచుతున్నాయి.

Today Gold Prices | పైపైకి పోతున్న ప‌సిడి ధ‌ర‌లు..

ఇక వెండి ధరలు కూడా తగ్గేదేలే అన్న‌ట్టు పెరుగుతూ పోతున్నాయి. కిలో వెండి ధర రూ. 1,57,100 కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,67,200 గా ఉంది.

చెన్నైలో వెండి రూ. 1,66,900కి చేరగా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో Bangalore రూ. 1,57,100 వద్ద ఉంది. ప్రపంచ బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. బంగారం–వెండి ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశముంది.

ఈ ట్రెండ్ నేపథ్యంలో ఇప్పుడు ఆభరణాలు కొనుగోలు చేయాలా.. లేక వేచి చూడాలా.. అన్న సందేహం వినియోగదారుల్లో నెలకొంది. కాగా, నగరానుగుణంగా ధరల్లో తేడాలు ఉండటం సహజం. స్థానిక డిమాండ్‌, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాలు ఇందుకు కారణం.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే…

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 24 carat gold ధరలు హైదరాబాద్‌లో రూ. 1,22,030, 22 క్యారెట్ల 22 carat gold ధర రూ. 1,11,860 గా ఉంది.

  • విజయవాడలో Vijaywada రూ. 1,22,030 – రూ.1,11,860గా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,22,080 – 22 క్యారెట్ల ధర రూ.1,12,030.
  • ముంబయి Mumbai లో రూ. 1,22,030 – రూ. 1,11,860.
  • వడోదరలో రూ. 1,22,080 – రూ. 1,11,910.
  • కోల్‌కతాలో రూ. 1,22,030 – రూ.1,11,860.
  • చెన్నైలో రూ. 1,22,030 – రూ. 1,11,860.
  • బెంగళూరులో రూ. 1,22,030 – రూ. 1,11,860.
  • కేరళ Kerala లో రూ. 1,22,030 – రూ. 1,11,860.
  • పుణెలో రూ.1,22,030, రూ.1,11,860గా న‌మోద‌య్యాయి.