అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Today Gold Price : బంగారం Gold ధరలలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు పెరగడం, మరో రోజు తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం. బంగారం ధర ఆ మధ్య కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ లక్ష రూపాయలకు దగ్గరైంది.
గత వారంలో 98 వేలకు దగ్గర్లో ఉన్న పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం తిరిగి లక్ష రూపాయలకు చేరువలోకి వచ్చింది. ఈ రోజు (జులై 17న) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 99,270 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 90,990కి ట్రేడ్ అవుతోంది. అంటే నిన్నటితో పోలిస్తే దాదాపు రూ.500 వరకు తగ్గిందనే చెప్పాలి. రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున కాస్త తగ్గినప్పుడే కొనుగోలు చేస్తే బెటర్.
Today Gold Price : కాస్త తగ్గుదల..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) 24 క్యారెట్లు (₹), 22 క్యారెట్లు (₹) పరంగా చూస్తే..
- హైదరాబాద్ Hyderabadలో 99,270 – 90,990
- విజయవాడ Vijayawada లో 99,270 – 90,990
- ఢిల్లీలో 99,420 – 91,140
- ముంబైలో 99,270 – 90,990
- వడోదరలో 99,320 – 91,040
- కోల్‌కతాలో 99,270 – 90,990
- చెన్నైలో 99,270 – 90,990
- బెంగళూరులో Bangalore 99,270 – 90,990
- కేరళలో 99,270 – 90,990
- పుణెలో 99,270 – 90,990 గా నమోదైంది.
Today Gold Price : వెండి ఇలా..
ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు (1 కేజీకి) చూస్తే.. హైదరాబాద్‌లో రూ.1,23,900గా ట్రేడ్ అయింది. విజయవాడలో రూ.1,23,900 , ఢిల్లీలో Delhi రూ.1,13,900 , చెన్నైలో రూ.1,23,900 , కోల్‌కతాలో రూ.1,13,900, కేరళలో రూ.1,23,900, ముంబైలో రూ.1,13,900, బెంగళూరులో రూ.1,13,900 , వడోదరలో రూ.1,13,900 , అహ్మదాబాద్‌లో రూ.1,13,900గా ట్రేడ్ అయింది.
మగువలు పసిడి ప్రియులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. పండుగలు, ఫంక్షన్లకు ఒంటినిండా బంగారు నగలు ధరించి తెగ మురిసిపోతుంటారు. కానీ, గత కొంతకాలంగా బంగారం ధరలు పైపైకి పోతుండడంతో గోల్డ్ కొనలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. మరి తగ్గినప్పుడే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయడం ఉత్తమం.