అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. రోజురోజుకీ పెరుగుతూ సామాన్య కొనుగోలుదారులకు భారీ షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజుల్లోనే బంగారం ధరలు ఏకంగా రూ.3 వేల వరకు పెరగ్గా, ఈ వారం కూడా అదే ధోరణి కొనసాగుతోంది. సోమవారం నుంచి వరుసగా రేట్లు పెరుగుతూనే ఉండటంతో పండుగలు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయంగా దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడం వంటి అంశాలే బంగారం ధరల (Gold Rates) పెరుగుదలకు ప్రధాన కారణాలని బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బుధవారం మరోసారి గోల్డ్, సిల్వర్ ధరలు (Gold and Silver Prices) స్వల్పంగా పెరిగాయి. వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్ (Hyderabad)లో10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,49,790గా కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ.1,49,780గా ఉండగా, బుధవారం స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,37,310గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,37,300 వద్ద స్థిరంగా కొనసాగింది. విజయవాడలో కూడా హైదరాబాద్‌తో సమానంగా ధరలు కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,49,790గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,310 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,650గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,010 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1,49,790గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,310గా కొనసాగుతోంది. రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,920గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,460 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3,20,100గా కొనసాగుతోంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.3,40,100గా ఉంది. నిన్న ఈ ధర రూ.3,40,000 వద్ద స్థిరపడింది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,40,100గా ఉండగా, నిన్న రూ.3,40,000గా ఉంది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.3,20,100గా కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.3,20,000 వద్ద నిలిచింది. నిత్యం పెరుగుతున్న ధరలతో పండుగలు, పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలనుకునే వారు కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు ఇన్వెస్టర్లు మాత్రం బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.