అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jan 15 Gold Price | వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం (Gold), వెండి ధరలు (Silver Prices) గురువారం కూడా స్వల్పంగా పెరిగి కొత్త స్థాయికి చేరాయి.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతుండటం, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన పసిడి, వెండివైపు మొగ్గు చూపడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం, వెండి డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయి.
Jan 15 Gold Price | పండుగ వేళ..
పండుగ వేళ సైతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి 15న ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,44,010కి చేరగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,32,010గా నమోదైంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,44,160కు, 22 క్యారెట్ల ధర రూ.1,32,160కు చేరుకుంది.
ప్రధాన నగరాల పరంగా చూస్తే.. హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణెలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,010గా – 22 క్యారెట్ల ధర రూ.1,32,010గా ఉంది. వడోదరలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,060కు – 22 క్యారెట్ల ధర రూ.1,32,060కు చేరింది.
వెండి ధరలు కూడా పెరుగుదల బాట పట్టాయి. కిలో వెండిపై సుమారు రూ.100 మేర పెరుగుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో Kerala కిలో వెండి ధర రూ.3,07,100గా ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో కిలో వెండి ధర రూ.2,90,100గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నంతకాలం బంగారం, వెండి ధరలు ఇదే ధోరణిలో కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.