Today Gold Price | తగ్గినట్టే తగ్గి.. మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఈరోజు ఎంత ఉందంటే..!

అక్షరటుడే, వెబ్ డెస్క్: Today Gold Price : ప‌సిడి ధ‌ర‌లు Gold Rates ఎప్పుడు ఎలా మార‌తున్నాయో చెప్ప‌డం కాస్త క‌ష్టంగానే ఉంది. ఆ మ‌ధ్య ల‌క్ష మార్క్‌కి చేరిన త‌ర్వాత కాస్త త‌గ్గ‌ముఖం ప‌ట్టాయి. కొంతకాలం నుంచి బంగారం ధరలు తగ్గతూ వచ్చాయి. నెల క్రితం లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.93 వేలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం రూ.90వేల దిగువన ట్రేడ్ […]

అక్షరటుడే, వెబ్ డెస్క్: Today Gold Price : ప‌సిడి ధ‌ర‌లు Gold Rates ఎప్పుడు ఎలా మార‌తున్నాయో చెప్ప‌డం కాస్త క‌ష్టంగానే ఉంది. ఆ మ‌ధ్య ల‌క్ష మార్క్‌కి చేరిన త‌ర్వాత కాస్త త‌గ్గ‌ముఖం ప‌ట్టాయి. కొంతకాలం నుంచి బంగారం ధరలు తగ్గతూ వచ్చాయి. నెల క్రితం లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.93 వేలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం రూ.90వేల దిగువన ట్రేడ్ అవుతోంది. కొంచెం తగ్గితే తీసుకుందామని అనుకుంటున్న స‌మ‌యంలో బంగారం పెరుగుతూ పోతుంది. తగ్గినట్టే తగ్గిన బంగారం ధ‌ర‌లు మళ్లీ పెరిగాయి.

Today Gold Price : మ‌ళ్లీ పెరిగాయి..

హైదరాబాద్ Hyderabad నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,130 దగ్గర ట్రేడ్ కాగా,10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం(22 carat gold price) ధర రూ.87200 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.71,350 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు చూస్తే.. 18, 22, 24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర(24 carat gold price) ఈ రోజు రూ.95,140 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,210 దగ్గర ట్రేడ్ అవుతుండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర(18 carat gold price) రూ.71,360 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇక వెండి Silver ధ‌ర‌లు విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ నగరంలో వెండి ధరలు ప్రతీ నిత్యం తగ్గుతూ వెళుతున్నాయి. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు స్థిరంగా తగ్గుతుండ‌డం కొంత ఉప‌శ‌మ‌నం. నిన్న 100 గ్రాముల వెండి ధర 10,800 రూపాయల దగ్గర ట్రేడ్(trade) అయింది. కేజీ వెండి(silver KG) ధర 1,08,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 10,790 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,07,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. అయితే బంగారం ధ‌ర‌లు రానున్న రోజుల‌లో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అందుకే కాస్త త‌గ్గిన‌ప్పుడే కొనుక్కోవ‌డం మంచిది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...