- Advertisement -
HomeజాతీయంGodrej Agrovet | MoFPIతో గోద్రేజ్ ఆగ్రోవెట్ అవగాహన ఒప్పందం.. ఆ రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు,...

Godrej Agrovet | MoFPIతో గోద్రేజ్ ఆగ్రోవెట్ అవగాహన ఒప్పందం.. ఆ రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు!

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Godrej Agrovet | భారత్​లోని అతిపెద్ద వ్యవసాయ-ఆహార వ్యాపార సంస్థలలో ఒకటైన గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కీలక అడుగు వేసింది.

కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoFPI)తో శుక్రవారం (సెప్టెంబరు 26) ఒక నాన్-బైండింగ్ అవగాహన ఒప్పందం Memorandum of Understanding (MoU) చేసుకుంది.

- Advertisement -

వరల్డ్ ఫుడ్ ఇండియా (World Food India) 2025 సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రూ. 960 కోట్ల పెట్టుబడితో అధునాతన తయారీ యూనిట్లు ఏర్పాటు చేయబోతోంది.

దీంతోపాటు ఒక R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తద్వారా కంపెనీ ఆహార శుద్ధి సామర్థ్యాలను మరింత పెంచుకోవడానికి కీలక అడుగు పడినట్లైంది.

ఈ సందర్బంగా గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సునీల్ కటారియా మాట్లాడారు. ఈ అవగాహన ఒప్పందం వ్యవసాయ-ఆహార శుద్ధి, పంపిణీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే తమ  దీర్ఘకాలిక వ్యూహానికి అనుగుణంగా ఉన్నట్లు తెలిపారు.

అప్‌స్ట్రీమ్ మౌలిక సదుపాయాలు, R&Dలో పెట్టుబడి పెట్టడం ద్వారా, సరఫరా గొలుసులో స్థిరమైన విలువను సృష్టించడం, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి దోహదపడటం తమ లక్ష్యమని పేర్కొన్నారు.

భారత ఆహార శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, వ్యవసాయ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లే అంశాలకు కట్టుబడి ఉన్నట్లు వివరించారు.

ఆహారశుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఐఏఎస్, అవినాష్ జోషి, గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్, కార్పొరేట్ అఫైర్స్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం.. గోద్రేజ్ Godrej ఆగ్రోవెట్ తయారీ, ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు ఒక అప్‌స్ట్రీమ్ R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

Godrej Agrovet | ఏ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టనున్నారంటే..

ఈ కంపెనీ ఆయిల్ పామ్ oil palm, పెట్ ఫుడ్ pet food వ్యాపారాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తమ పెట్టుబడులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, త్రిపుర, మహారాష్ట్ర రాష్ట్రాలలో విస్తరించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన సందర్భంగా ఆహారశుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అవినాష్ జోషి మాట్లాడారు. గోద్రేజ్ ఆగ్రోవెట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు.

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్‌కు ఒక కీలక భాగస్వామిగా ఈ కంపెనీ ఉందని తెలిపారు. గోద్రేజ్ ఆగ్రోవెట్ భారతదేశ పోషణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, కొత్త వినియోగదారుల విభాగాలను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్, కార్పొరేట్ అఫైర్స్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి మాట్లాడుతూ.. భారత ఆహారశుద్ధి రంగం అనేక పెట్టుబడులను ఆకర్షిస్తోందని తెలిపారు.

ప్యాకేజ్డ్ ఫుడ్స్ packaged foods గురించి ఉన్న అపోహలను తొలగించి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధిని ప్రోత్సహించాలనే MoFPI సంకల్పం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌ ఈ పరివర్తనలో భాగస్వాములుగా మారినందుకు సంతోషంగా ఉందన్నారు.

కాగా, ఈ సదుపాయాలన్నీ 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి కావొచ్చని అంచనా. తద్వారా భారీ స్థాయిలో ఉపాధిని కల్పించడం, ప్రాంతీయ అభివృద్ధికి, నైపుణ్యాల పెంపుదలకు కూడా దోహదపడనుంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News