Dil Raju | ఇందూరు తిరుమలలో కనుల పండువగా ‘శ్రీ గోదా రంగనాథ’ కల్యాణం

అక్షరటుడే, ఇందూరు : Dil Raju | నర్సింగ్​పల్లి (Narsingpalli) ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీ గోదా రంగనాథ కల్యాణం కనుల పండువగా జరిగింది. అమ్మవారి కల్యాణ వేడుకల్లో దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు. Dil Raju | ‘శ్రీ వ్రతం’ చేసి రంగనాథుడిలో విలీనమై.. నేడు గోదా కల్యాణంతో (Godha Kalyanam) పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తుందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. గోదాదేవి ఎంతో నిష్టతో ‘శ్రీ వ్రతం’ చేసి రంగనాథుడిని […]

అక్షరటుడే, ఇందూరు : Dil Raju | నర్సింగ్​పల్లి (Narsingpalli) ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీ గోదా రంగనాథ కల్యాణం కనుల పండువగా జరిగింది. అమ్మవారి కల్యాణ వేడుకల్లో దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు.

Dil Raju | ‘శ్రీ వ్రతం’ చేసి రంగనాథుడిలో విలీనమై..

నేడు గోదా కల్యాణంతో (Godha Kalyanam) పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తుందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. గోదాదేవి ఎంతో నిష్టతో ‘శ్రీ వ్రతం’ చేసి రంగనాథుడిని కల్యాణమాడి వారిలో లీనమైందని అన్నారు. ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ (Thiruppavai) పఠనం మనకు వైకుంఠనాథుడిని హృదయానికి చేరువ చేస్తుందన్నారు. గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్దఎత్తున పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరోహిత్ కుమారాచార్య, విజయ్ స్వామి, ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు దంపతులు, నర్సింహారెడ్డి దంపతులు, నర్సారెడ్డి, రమేష్, నరాల సుధాకర్ దంపతులు, ప్రసాద్ భాస్కర్, మురళి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...