Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Yellareddy | ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

అక్షరటుడే,ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం అమ్మవారు దుర్గామాత అలంకరణలో దర్శనమిచ్చారు. మండపం వద్ద సాయంత్రం దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్ పెరుగు నాగరాజు స్వామి, మండప నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.