అక్షరటుడే, ఇందూరు: Goddess Bhulakshmi | అమ్మవారి నవరాత్రి వేడుకలు Navratri celebrations నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆ దేవదేవిని భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో కొలుస్తున్నారు.

మహిమాన్వితమైన అమ్మవారిని రోజుకో అవతారంలో నిష్ఠతో పూజిస్తున్నారు. నిజామాబాద్ Nizamabad నగర శివారులోని ముబారక్ నగర్ పరిధిలో ఉన్న భూలక్ష్మిమాతకు భక్తులు నీరాజనం పలుకుతున్నారు.

నవరాత్రి వేడుకల సందర్భంగా ఆదివారం (సెప్టెంబరు 28) భూలక్ష్మిమాతకు భక్తులు బోనాలు తీశారు. ఉదయమే తలంటు స్నానం చేసి, ముచ్చటగా ముస్తాబైన మహిళలు.. అమ్మవారికి నైవేద్యం వండారు.

Goddess Bhulakshmi | బోనాల సమర్పణ
అనంతరం బోనమెత్తి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో భూలక్ష్మిమాతకు ప్రత్యేక పూజలు చేసి, బోనం సమర్పించారు.

అనంతరం ఆలయం ఆవరణలో అమ్మవారిని కొలుస్తూ ఆడిపాడారు. ఆటపాటలతో సందడి చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

అంతకు ముందు ఉదయం ఆలయ అర్చకులు కళ్యాణ్ శర్మ, వేద పండితులు రాజశేఖర్ ఆధ్వర్యంలో చంఢీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
