అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhatti Vikramarka | రాష్ట్ర భవిష్యత్‌కు గ్లోబల్ సమ్మిట్ కీలకం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) నిర్వహించనున్న విషయం తెలిసిందే.
సమ్మిట్ కోసం అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశా విదేశాల నుంచి ఈ సదస్సుకు అతిథులు హాజరు కానున్నారు. భట్టి విక్రమార్క మాట్లడుతూ.. ఈ సమ్మిట్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో ఉపయోగకరం అన్నారు. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నట్లు వెల్లడించారు.
Bhatti Vikramarka | విజన్ డాక్యుమెంట్
ఈ నెల 8న మధ్యాహ్నం 1:30కి సమ్మిట్ ప్రారంభం అవుతుంది. సమ్మిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ప్రారంభిస్తారు. 8న మ.2:30కి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రసంగిస్తారు.
నీతిఆయోగ్ ISB సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు భట్టి తెలిపారు. 9న సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందజేశామన్నారు. ఇండిగో సంక్షోభంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కోసం ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) తెలిపారు. పెట్టుబడులకు ఎవరైనా MOUలు చేసుకోవచ్చని చెప్పారు. రెండు రోజుల్లో వీలైనన్ని ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు.
