ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో యూఎస్‌ మార్కెట్లు లాభాలతో ముగియగా.. యూరోప్‌ మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అయ్యాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    ఎస్‌అండ్‌పీ(S&P) 0.32 శాతం, నాస్‌డాక్‌ 0.25 శాతం పెరగ్గా.. గురువారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.21 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ 0.57 శాతం, డీఏఎక్స్‌(DAX) 0.21 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.13 శాతం నష్టపోయాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ప్రధాన ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం ఎక్కువగా స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల సమయంలో స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.30 శాతం, హంగ్‌సెంగ్‌(Hang Seng) 0.20 శాతం, షాంఘై 0.06 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.01 శాతం లాభంతో ఉన్నాయి. కోస్పీ 0.30 శాతం, నిక్కీ 0.15 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.17 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 1,858 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా, డీఐఐలు నికరంగా రూ. 1,223 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.88 నుంచి 0.92 కు పెరిగింది. విక్స్‌(VIX) 2.09 శాతం తగ్గి 11.24 వద్ద ఉంది. ఇది 15 నెలల కనిష్ట స్థాయి.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.40 శాతం తగ్గి, 68.79 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలహీనపడి 85.94 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.47 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.50 వద్ద కొనసాగుతున్నాయి.

    More like this

    Baswa laxmi narsaiah | కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్య

    అక్షరటుడే, ఇందూరు: Baswa laxmi narsaiah | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) ఆయా మోర్చాల...

    Kamareddy Collector | ప్రజల ప్రాణాలు కాపాడేందుకే స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | ప్రజల ప్రాణాలను కాపాడేందుకే లేజర్ గన్స్ ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్...

    BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా స్రవంతి రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి...