Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌ లాభాలతో ఉండగా.. యూరోప్‌ మార్కెట్లు నష్టపోయాయి. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా సాగుతున్నాయి. Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets).. గురువారం అమెరికా మార్కెట్లలో జూన్‌టీంత్‌ హాలిడే(Holiday). దీంతో అక్కడి మార్కెట్లలో ట్రెడిరగ్‌ సాగలేదు. శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.39 శాతం లాభంతో ఉంది. Pre Market Analysis […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌ లాభాలతో ఉండగా.. యూరోప్‌ మార్కెట్లు నష్టపోయాయి. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా సాగుతున్నాయి.

Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

గురువారం అమెరికా మార్కెట్లలో జూన్‌టీంత్‌ హాలిడే(Holiday). దీంతో అక్కడి మార్కెట్లలో ట్రెడిరగ్‌ సాగలేదు. శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.39 శాతం లాభంతో ఉంది.

Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సీఏసీ(CAC) 1.36 శాతం, డీఏఎక్స్‌ 1.13 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.59 శాతం నష్టపోయాయి.

Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిశ్రమంగా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో కోస్పీ(Kospi) 1.03 శాతం, హంగ్‌సెంగ్‌ 0.61 శాతం, షాంఘై 0.10 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.13 శాతం లాభాలతో ఉండగా.. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.79 శాతం, నిక్కీ 0.09 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.02 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐలు వరుసగా మూడో రోజూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గురువారం నికరంగా రూ. 934 కోట్లు, డీఐఐలు రూ. 605 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.80 నుంచి 1.03కు చేరింది . విక్స్‌(VIX) 0.14 శాతం తగ్గి 14.26 వద్ద ఉంది. పీసీఆర్‌, విక్స్‌ కంఫర్ట్‌ జోన్‌లో ఉండడం బుల్స్‌(Bulls)కు అనుకూల వాతావరణాన్ని సూచిస్తున్నాయి.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 76.85 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 25 పైసలు పడిపోయి 86.73 వద్ద ఉంది.
  • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 98.67 వద్ద ఉండగా.. యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.40 వద్ద నిలిచాయి.
  • ఇరాన్‌, ఇజ్రాయిల్‌ యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే విషయంపై త్వరలోనే ట్రంప్‌ నిర్ణయాన్ని ప్రకటిస్తారని వైట్‌హౌస్‌ తెలిపింది.
  • చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.
  • ముడి చమురు(Crude oil) ధరలు గరిష్ట స్థాయిలలో కదలాడుతున్నాయి. ఇది భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతికూలం.
Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...