Pre Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : అమెరికా సెనెట్‌ ఆమోదించిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌(Big beautiful bill) నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్లు ఎక్కువగా నెగెటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. యూఎస్‌(US) మార్కెట్‌లో రెడ్‌లో ముగియగా.. యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడింగ్‌ సెషన్‌ను ముగించాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets).. నాస్‌డాక్‌(Nasdaq) 0.82 శాతం, ఎస్‌అండ్‌పీ 0.11 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్‌ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : అమెరికా సెనెట్‌ ఆమోదించిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌(Big beautiful bill) నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్లు ఎక్కువగా నెగెటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. యూఎస్‌(US) మార్కెట్‌లో రెడ్‌లో ముగియగా.. యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడింగ్‌ సెషన్‌ను ముగించాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

నాస్‌డాక్‌(Nasdaq) 0.82 శాతం, ఎస్‌అండ్‌పీ 0.11 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.06 శాతం లాభంతో కొనసాగుతోంది.

Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

డీఏఎక్స్‌ ఒక శాతం, సీఏసీ(CAC) 0.04 శాతం నష్టపోగా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.28 శాతం లాభపడింది.

Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో కోస్పీ(Kospi) 1.54 శాతం, నిక్కీ ఒక శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.35 శాతం, షాంఘై 0.04 శాతం నష్టంతో ఉన్నాయి. హంగ్‌సెంగ్‌ 0.66 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.31 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.07 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 1,970 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు నికరంగా రూ. 771 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో 0.81 నుంచి 0.88కి పెరిగింది. విక్స్‌ 2.01 శాతం తగ్గి 12.53 వద్ద ఉంది. ఇది బుల్స్‌కు అనుకూల వాతావరణాన్ని సూచిస్తోంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.19 శాతం పెరిగి 67.24 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడి 85.52 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.26 శాతం పెరిగి 4.25 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 0.05 శాతం తగ్గి 96.73 వద్ద కొనసాగుతున్నాయి.

వాణిజ్య ఒప్పందాల విషయంలో ట్రంప్‌ ఇచ్చిన టారిఫ్‌ పాజ్‌(Tariff pause) గడువు ఈనెల 9వ తేదీతో ముగియనుంది. ఇప్పటికీ చాలా దేశాలతో ఎలాంటి ట్రేడ్‌ డీల్‌ కుదరలేదు. ఈ నేపథ్యంలో జూలై 9 తర్వాత అమెరికా అధ్యక్షుడు ఎలా వ్యవహరిస్తారోనన్న ఆందోళన మార్కెట్లలో నెలకొంది. మరోవైపు ట్రంప్‌ తీసుకువచ్చిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌కు సెనెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం అమెరికా మార్కెట్లు నెగెటివ్‌గా ట్రేడ్‌ అయ్యాయి. ఈ బిల్‌ అమెరికా ట్రెజరీ మార్కెట్‌కు మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...