Pre market analysis | గ్లోబల్‌ మార్కెట్లలో జోరు.. అయినా గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ..

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis : యూఎస్‌(US), చైనాల మధ్య తాత్కాలికంగా టారిఫ్‌ల తగ్గింపు ఒప్పందం కుదరడంతో గత ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లో వాల్‌స్ట్రీట్‌ పరుగులు తీసింది. యూరోప్‌ మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. మంగళవారం హంగ్‌సెంగ్‌(Hangseng) మినహా ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందిస్తున్నాయి. సోమవారం నాస్‌డాక్‌(Nasdaq) 4.35 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 3.28 శాతం లాభపడిరది. కాగా మంగళవారం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. మన మార్కెట్లు సోమవారం భారీ ర్యాలీ […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis : యూఎస్‌(US), చైనాల మధ్య తాత్కాలికంగా టారిఫ్‌ల తగ్గింపు ఒప్పందం కుదరడంతో గత ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లో వాల్‌స్ట్రీట్‌ పరుగులు తీసింది. యూరోప్‌ మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. మంగళవారం హంగ్‌సెంగ్‌(Hangseng) మినహా ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందిస్తున్నాయి. సోమవారం నాస్‌డాక్‌(Nasdaq) 4.35 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 3.28 శాతం లాభపడిరది. కాగా మంగళవారం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. మన మార్కెట్లు సోమవారం భారీ ర్యాలీ తీసిన నేపథ్యంలో మంగళవారం ఉదయం ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు అవకాశం ఉంది.

Pre market analysis : లాభాల బాటలో యూరోప్‌ మార్కెట్లు

యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. సీఏసీ 1.35 శాతం పెరగ్గా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.58 శాతం, డీఏఎక్స్‌(DAX) 0.29 శాతం లాభపడ్డాయి.

Pre market analysis : పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు..

హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మినహా మిగతా ఆసియా(Asia) మార్కెట్లు మంగళవారం లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో నిక్కీ(Nikkei) 1.7 శాతం లాభంతో ఉండగా.. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.25 శాతం, స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.5 శాతం, కోస్పీ 0.16 శాతం లాభంతో కదలాడుతున్నాయి. షాంఘై ఫ్లాట్‌గా ఉంది. హంగ్‌సెంగ్‌ 1.46 శాతం నష్టంతో కొనసాగుతోంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.60 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pre market analysis : గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐ(FII)లు తిరిగి నికర కొనుగోలుదారులుగా మారారు. గత ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ. 1,246 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐ(DII)లు సైతం రూ. 1,448 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 61.77 డాలర్లకు చేరింది.

ఇండియా విక్స్‌(VIX) గణనీయంగా తగ్గింది. సోమవారం 14.98 శాతం తగ్గి, 18.39కుి చేరింది. ఇది మార్కెట్లలో స్థిరత్వాన్ని సూచిస్తుంది. నిఫ్టీ పుట్‌ కాల్‌ రేషియో(PCR) 0.94 నుంచి 1.29కు చేరింది. ఇది బుల్స్‌కు అనుకూలం. రుతుపవనాలు ముందస్తుగానే వచ్చే అవకాశాలున్నాయని ఐఎండీ(IMD) పేర్కొంది.

భారత్‌ (Bharath)-పాక్‌ల మధ్య సీజ్‌ ఫైర్‌ ఒప్పందం కుదరడంతో జియో పొలిటికల్‌ టెన్షన్స్‌ కాస్త తగ్గాయి. అయితే పాక్‌ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

యూఎస్‌, చైనా(China)ల మధ్య టారిఫ్‌ల తగ్గింపుపై తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు పరస్పరం 115 శాతం టారిఫ్‌లు తగ్గించుకోవడానికి అంగీకరించాయి. వివిధ దేశాల మధ్య ట్రేడ్‌ డీల్స్‌(Trade deals)లో పురోగతికితోడు మన ఆర్థిక స్థిరత్వం మార్కెట్లను ముందుకు నడిపిస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...