అక్షరటుడే, ఇందూరు: BJP Candidate Koradi Kiran | ఆశీర్వదించి అవకాశమిస్తే 52వ డివిజన్లో అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కొరడి కిరణ్ (BJP Candidate Koradi Kiran) అన్నారు. ఈ మేరకు పలు కాలనీలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ప్రజల వెంటే ఉంటాం..
ఈ సందర్భంగా అభ్యర్థి కొరడి కిరణ్ కాలనీలలో తిరుగుతూ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. డివిజన్‌పై పూర్తి పట్టు ఉందని సమస్యల పరిష్కారానికి ఒక్కసారి ఓట్లు వేసి తనను కార్పొరేటర్‌గా గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. స్థానికంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ (BJP MLA Dhanpal) సహకారంతో డివిజన్‌కు ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
పథకాల అమలుపై శ్రద్ధ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను డివిజన్లో పక్కాగా అమలయ్యేలా ప్రయత్నం చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక్కసారి అవకాశమిచ్చి తనను గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

