Homeజిల్లాలునిజామాబాద్​Geeta Jayanti | ఘనంగా గీతా జయంతి ఉత్సవాలు

Geeta Jayanti | ఘనంగా గీతా జయంతి ఉత్సవాలు

భీమ్​గల్​ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో గీతా జయంతి ఉత్సవాలను సోమవారం నిర్వహించారు. వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్: Geeta Jayanti | పట్టణంలోని సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో (Saraswati Vidya Mandir High School) గీతా జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని, భగవద్గీతను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గీతా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి, సరైన మార్గంలో పయనించడానికి భగవద్గీతలోని (Bhagavad Gita) సందేశాలు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. విద్యార్థులు భగవద్గీతలోని శ్లోకాలతో కూడిన నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. విద్యార్థులు గీతలోని ముఖ్య ఘట్టాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన నాటిక ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది.

గీత కేవలం ఒక మత గ్రంథం కాదని, అది జీవిత సారాంశాన్ని, కర్మ సిద్ధాంతాన్ని బోధించే గొప్ప పుస్తకమని కొనియాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే గీతా పఠనం, అందులోని నీతిని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు భగవద్గీత గ్రంథాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్​ఎం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News