Jeedimetla | ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Jeedimetla | ప్రస్తుతం సమాజంలో బంధాలు, అనుబంధాలకు తావు లేకుండా పోయింది. ఆస్తులు, వివాహేతర సంబంధాలు(Extramarital Affairs), ప్రేమ పేరిట అయినవారినే చంపుకుంటున్నారు. ప్రస్తుతం అవుతున్న నేరాల్లో ఎక్కువ శాతం వీటిమూలంగా జరుగుతున్నాయి. కన్నవారిని సైతం కడతేర్చడానికి పిల్లలు వెనకాడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ బాలిక ప్రియుడితో కలిసి తన తల్లిని హత్య చేసింది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పోలీస్​ స్టేషన్(Jeedimetla Police Station)​ పరిధిలో చోటు చేసుకుంది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Jeedimetla | ప్రస్తుతం సమాజంలో బంధాలు, అనుబంధాలకు తావు లేకుండా పోయింది. ఆస్తులు, వివాహేతర సంబంధాలు(Extramarital Affairs), ప్రేమ పేరిట అయినవారినే చంపుకుంటున్నారు. ప్రస్తుతం అవుతున్న నేరాల్లో ఎక్కువ శాతం వీటిమూలంగా జరుగుతున్నాయి. కన్నవారిని సైతం కడతేర్చడానికి పిల్లలు వెనకాడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ బాలిక ప్రియుడితో కలిసి తన తల్లిని హత్య చేసింది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పోలీస్​ స్టేషన్(Jeedimetla Police Station)​ పరిధిలో చోటు చేసుకుంది.

జీడిమెట్లలోని ఓ కాలనీలో నివాసం ఉంటే బాలిక(16) పదో తరగతి చదువుతోంది. ఆమెకు శివ (19) అనే యువకుడితో ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడాగా అది ప్రేమగా మారింది. అయితే ఆ విషయం బాలిక తల్లి అంజలికి తెలియడంతో మందలించింది. పదో తరగతికే ప్రేమ ఏంటని బెదిరించింది. దీంతో వారం క్రితం శివతో బాలిక వెళ్లిపోయింది. ఈ మేరకు తల్లి అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.

Jeedimetla | అడ్డు తొలగించుకోవాలని..

ప్రియుడితో వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన బాలిక తన తల్లిని అడ్డు తొలగించుకోవాలని స్కెచ్​ వేసింది. ఈ మేరకు తన ప్రియుడు పగిల్ల శివ (19) అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్ (18) సహాయంతో తన తల్లిని హత్య చేసింది. నల్గొండ నుంచి శివ, యశ్వంత్​ బాలిక ఇంటికి వచ్చారు. బాలిక తల్లి పూజ చేస్తుండగా.. శివ వెనక నుంచి దాడి చేశాడు. అనంతరం సదరు బాలిక తన తల్లి తలపై సుత్తితో కొట్టగా.. యశ్వంత్​ గొంతు కోశాడు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. బాలిక తల్లి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించి, దొరలను ఎదిరించిన చాకలి ఐలమ్మ ముని మనవరాలు కావడం గమనార్హం.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...