అక్షరటుడే, వెబ్డెస్క్: GHMC | జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు మెగా శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమ, మంగళవారాలలో ఈ వేస్ట్ సేకరిస్తున్నారు.
జీహెచ్ఎంసీ (GHMC) డిసెంబర్ 29న అతిపెద్ద శానిటేషన్ డ్రైవ్ (Sanitation Drive)ను ప్రారంభించింది. జనవరి 31 వరకు నగరంలోని మొత్తం 300 వార్డుల్లో పారిశుధ్య పనులు చేపట్టనున్నారు. పాత వ్యర్థాలు, చెత్తా చెదారం తొలగింపు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, రోడ్లు, డివైడర్లు & మీడియన్లను పారిశుధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు.
GHMC | ఈ వ్యర్థాల సేకరణ
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంది. ప్రజల తమ ఇళ్లలో పనికి రాకుండా పోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను (Electronic Goods) పక్కన పడేస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది (GHMC Staff) శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించడానికి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. నివాస, వాణిజ్య, ప్రజా ప్రాంతాలను కలుపుకుని నగరవ్యాప్తంగా మెగా ఈ వేస్ట్ శానిటేషన్ డ్రైవ్ ప్రస్తుతం 300 వార్డులలో జరుగుతోంది.
GHMC | ఇంటింటికి తిరుగుతూ..
ఈ డ్రైవ్లో భాగంగా వాహనాలు ఇంటింటికి తిరుగుతూ ఈ వ్యర్థాలను సేకరిస్తాయి. పలు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు సైతం ఏర్పాటు చేశారు. ప్రజలు పాడైన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, UPS, ఇన్వర్టర్లు, బ్యాటరీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను సిబ్బందికి అందించవచ్చు. వాటిని శాస్త్రీయ ప్రాసెసింగ్ చేసి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.