అక్షరటుడే, హైదరాబాద్: local body MLC elections : తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. బుధవారం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి.
హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు ఓటు వేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
ఎన్నికల బరిలో బీజేపీ, ఎంఐఎం మాత్రమే నిలిచాయి. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ల్ హాసన్, భాజపా నుంచి గౌతమ్ రావు పోటీ చేశారు. గెలుపుపై ఎంఐఎం ధీమాగా ఉంది. భాజపా మాత్రం క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఇద్దరే బరిలో ఉండటం, పోల్ అయింది కేవలం 88 ఓట్లే కావడంతో వెంటనే ఫలితం వెలువడే అవకాశం ఉంది.