అక్షరటుడే, బోధన్ : Panchayat Elections | బోధన్ మండలం (Bodhan Mandal) మీనార్పల్లి (Meenarpalli)లో సర్పంచ్ అభ్యర్థి బొబ్బ కవిత వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపించినట్లయితే గ్రామంలో జరిగే ప్రతి పెళ్లికి రూ.10వేల కానుకగా ఇస్తానని ఆమె హామీ చ్చారు.
ఉన్నత చదువులు చదువుకున్న తనను గెలిపిస్తే.. గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గ్రామస్థులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంతో పాటు గ్రామానికి నిధులు తీసుకొచ్చేవిధంగా కృషి చేస్తానని.. గ్రామాన్ని మరింత బాగు చేసుకుందామని ఆమె ప్రచారంలో పేర్కొంటున్నారు.
