అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhartha Mahasayulaki Wignyapthi | మాస్ మహారాజా రవితేజ (Hero Ravi Teja) హీరోగా నటించిన తాజా కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నేడు థియేటర్లలో సందడి చేయనుంది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ప్రేక్షకులకు పక్కా పండుగ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ముఖ్యంగా గత కొంతకాలంగా వరుస సినిమాలతో నిరాశపరిచిన రవితేజ, ఈ చిత్రంతో మళ్లీ కామెడీ జోనర్‌లోకి వచ్చేశాడని అభిమానులు అంటున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల (Director Kishore Tirumala) తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, టైమింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి థియేటర్లలో హుషారును నింపుతున్నాయి. ఫస్ట్ హాఫ్ నుంచే నవ్వులు పూయించే సన్నివేశాలు, క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమా మంచి రెస్పాన్స్‌ను రాబడుతోంది.
Bhartha Mahasayulaki Wignyapthi | టార్గెట్ చేశారా..
ఈ సినిమాలో సోషల్ మీడియాలో (Social Media) ఎక్కువగా చర్చకు వస్తున్న సీన్ ఒకటి ఉంది. జనరేటర్ చుట్టూ సాగే ఓ కామెడీ ఎపిసోడ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రవితేజ ప్లాన్‌లో భాగంగా సునీల్ చేసే పనికి, వెన్నెల కిషోర్ ఇచ్చే కౌంటర్లు థియేటర్లలో పెద్ద ఎత్తున నవ్వులు తెప్పిస్తున్నాయి. “ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన” అంటూ వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తున్నాయి. ఈ సీన్‌ను కొందరు రియల్ లైఫ్‌లో జరిగిన ఓ ప్రముఖ వివాదంతో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ సన్నివేశానికి థియేటర్లలో వస్తున్న స్పందనను అభిమానులు వీడియోలుగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరుగుతోంది. “ఇదే రవితేజ అంటే”, “ఇలాంటి పాత్రలే ఆయనకు సెట్ అవుతాయి” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పండుగ సీజన్‌కు సరిపోయేలా కుటుంబంతో కలిసి చూసే సినిమాగా ఇది మంచి ఆప్షన్‌గా మారిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రవితేజకు ఇది మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చే సినిమాగా నిలుస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ రిజల్ట్ చెప్పనుంది.