అక్షరటుడే, వెబ్‌డెస్క్: gang rape perpetrators | అమాయక బాలికపై అదును చూసి ఎగబడ్డారు. కీచకుల గుంపు సామూహిక అత్యాచారానికి తెగబడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో జరిగింది.
మైనర్పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమజంటను నిందితులు అటవీశాఖ సిబ్బంది పేరుతో బెదిరించారు.
gang rape perpetrators | ప్రేమికుడిని నిర్బంధించి..
ప్రేమికుడిని నిర్బంధించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గ చర్యను నిందితులు రికార్డు కూడా చేశారు. ఈ దుర్మార్గపు ఘటన గత నెల 25వ తేదీన జరిగింది.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను కిశోర్, మహేష్, హేమంత్గా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో, రాబరీ, అట్రాసిటీ, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు.
ఈ మేరకు శుక్రవారం (అక్టోబరు 3) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతరం నిందితులను కోర్టుకు తీసుకెళ్లారు.
కాగా, ఈ సందర్భంగా నిందితులకు పోలీసులు బేడీలు వేశారు. ఆ కామాంధులను నడిరోడ్డుపై కిలోమీటరు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నిందితులను చూసిన ప్రజలు దారి పొడవునా తిట్టిపోశారు. శాపనార్థాలు పెట్టారు.