అక్షరటుడే, ఇందూరు: Vinayaka chavithi | వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సందడి మొదలైంది. ఇప్పటికే గణనాథులను ప్రతిష్టించేందుకు పందిర్లు, డెకరేషన్ చేయడంలో యువత బిజీగా మారారు.
కాగా.. నిమజ్జన వేడుకలకు సంబంధించి నగరంలోని వినాయక నగర్లో (Vinayak Nagar) ఉన్న గణపతుల బావి (Vinayakula bavi) పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. కార్పొరేషన్ (Nizamabad Municipal corporation) పరిధిలోని ఇళ్లలో, కాలనీల్లో ప్రతిష్ఠించే చిన్న గణపతులను వినాయకుల బావిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో బావిని శుభ్రం చేసి నీళ్లను నింపే పనిలో కార్పొరేషన్ సిబ్బంది ఉన్నారు. కాగా.. ఈనెల 27న వినాయక చవితి ఉన్న సంగతి తెలిసిందే.
Vinayaka chavithi | సెప్టెంబర్ 6న నిమజ్జనోత్సవం..
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 6న నిమజ్జనం (Ganesh Nimajjanam) నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ సార్వజనిక్ గణేష్ మండలి (Saarvajanik Ganesh Mandali) అధ్యక్షుడు బంటు గణేష్ తెలిపారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండడంతో గణేష్ మండళ్ల ప్రతినిధులు నిమజ్జనంపై సందిగ్ధతలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సార్వజనిక్ గణేష్ మండలి 6న నిమజ్జనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఈసారి గణపతి రథం వెనకాలే అన్ని మండళ్ల గణపతులు రావాలని కోరారు.
వినాయక్‌నగర్ గణపతుల బావిలో నుంచి తొలగించిన మట్టి