అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Realme 15 Pro | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్(Smart Phone) తయారీ సంస్థ రియల్‌మీ గేమ్ ఆఫ్ త్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను విడుదల చేసింది. స్టైలిష్ లుక్‌తో ఈ మోడల్ ఆకట్టుకుంటోంది.
రియల్‌మీ 15 ప్రో మోడల్‌ను ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మిడ్ రేంజ్ ఫోన్‌ను తాజాగా గేమ్ ఆఫ్ త్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్(Game of Thrones Limited Edition)లో తీసుకువచ్చింది. ఫ్లిప్ కార్ట్(Flipkart)తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. చూడడానికి ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..
డిస్‌ప్లే : 6.8 ఇంచ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో తీసుకువచ్చిన ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1280 *
2400 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. హెచ్‌డీఆర్10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్ ఇస్తుంది. ఐపీ68/ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్.
సాఫ్ట్‌వేర్ : స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 OS తో పనిచేస్తుంది.
కెమెరా : వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్(Triple Camera Setup) కలిగి ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ : 7000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 80 వాట్ సూపర్‌ఊక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్ : ఫ్లోయింగ్ సిల్వర్, సిల్క్ పర్పుల్, వెల్వెట్ గ్రీన్ కలర్స్‌లో గేమ్ అఫ్ త్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకువచ్చిన ఈ మోడల్ ధర రూ. 44,999.
కార్డ్ ఆఫర్స్ : ఎస్‌బీఐ(SBI), ICICI, Yes bank, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్‌లతో కొనుగోలు చేసేవారికి రూ. 3 వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.