అక్షరటుడే, ఇందూరు: Gamblers arrested | నిజామాబాద్ నగరంలో జూదం సంస్కృతి విస్తరిస్తోంది. అడపాదడపా పోలీసులు దాడులు చేపట్టి, కేసులు నమోదు చేస్తున్నా.. జూదరులు లెక్కచేయడం లేదు.
Gamblers arrested | పక్కా సమాచారం మేరకు..
తాజాగా మరో జూదం కేసు వెలుగుచూసింది. నగరంలోని ఒకటో ఠాణా పరిధిలో ఉన్న గీతాభవన్ కాంప్లెక్స్‌లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తన బృందంతో కలిసి కాంప్లెక్స్‌లో దాడులు చేపట్టారు.
పోలీసుల తనిఖీల్లో ఐదుగురు జూదరులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.6 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
