95
అక్షరటుడే, బాల్కొండ : Armoor Police | ఆర్మూర్ రూరల్ సీఐగా గడ్డం జాన్ రెడ్డి (CI Gaddam John Reddy) నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించిన శ్రీధర్ రెడ్డిని ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో గడ్డం జాన్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. జాన్ రెడ్డి కరీంనగర్ –3 ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై ఆర్మూర్ రూరల్ సీఐ (Armoor Rural CI)గా వచ్చారు. నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన గడ్డం జాన్ రెడ్డిని బాల్కొండ ఎస్సై శశిధర్ (Balkonda SI Shashidhar) మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.