అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | నాగన్న మెట్లబావి, పోచారం ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి సర్కారు ముందుకొచ్చింది. ఈ రెండు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు రూ.5కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Mla Madan Mohan | ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో..
నాగన్న మెట్లబావి, పోచారం ప్రాజెక్టులకు అభివృద్ధి చేయాలని పేర్కొంటూ ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madan Mohan) కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రికి పలుమార్లు విన్నపాలు అందజేశారు. శాసనసభ సమావేశాల్లో (Legislative Assembly sessions) కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, పలు మార్లు టీజీటీడీసీ (TGTDC) కార్యాలయాలను సందర్శించి అధికారులతో సమావేశమయ్యారు. ఈ ప్రాంతాల ప్రాధాన్యతను, వాటి అభివృద్ధి అవకాశాలను వివరించారు. ఈ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ఈ ప్రాంతంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని వారికి స్పష్టం చేశారు.
స్పందించిన టీజీటీడీసీ..
దీంతో స్పందించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ద్వారా రూ.5 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. నిధుల విడుదలతో ఈ రెండు ప్రాంతాల అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందన్నారు. నిధులు మంజూరు చేసిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా.. ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల స్థానిక ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులతో పర్యాటక మౌలిక వసతులు మెరుగుపడి, ప్రాంత ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.