అక్షరటుడే, బాన్సువాడ: Banswada | స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) భాగంగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బాన్సువాడ మండలం (Banswada mandal) తిర్మలాపూర్‌లో స్నేహబంధం వెల్లివిరిసింది.
వివరాల్లోకి వెళ్తే.. తిర్మలాపూర్ సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్ కాగా.. ఈసారి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు మ్యాడ మల్లారెడ్డి తన తల్లి మ్యాడ అనసూయను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే మల్లారెడ్డి స్నేహితులు అంతా ముందుకొచ్చి అనసూయ నామినేషన్ ఫీజును సొంతంగా భరించారు. అలాగే రాబోయే ప్రచార కార్యక్రమాలకు సామగ్రి సేకరణ, ఇంటింటి ప్రచారంలో పూర్తి మద్దతు తెలుపుతామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మల్లారెడ్డి స్నేహితులు నరేష్, శ్రీకాంత్, శ్రీను, అరుణ్, మనోజ్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
