అక్షరటుడే, ఇందూరు: KITS | కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాల (కిట్స్) (Kakatiya Women’s Engineering College) ఫ్రెషర్స్ పార్టీ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఉత్తమంగా విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు.
KITS | అలరించిన నృత్యాలు..
ఫ్రెషర్స్పార్టీ (freshers’ party) సందర్భంగా విద్యార్థినుల నృత్యాలు అలరించాయి. విద్యార్థినులు వెస్ట్రన్, క్లాసికల్ డ్యాన్సులు చేశారు. విద్యార్థినుల ర్యాంప్‌వాక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సెల్వరాజ్, వైస్ ప్రిన్సిపాల్ సాయారెడ్డి, సిబ్బంది వేణు గోపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అధ్యాపక బృందం
నృత్యం చేస్తున్న విద్యార్థిని


