Homeతాజావార్తలుPanchayat Elections | గెలిస్తే ఉచిత వైఫై.. సర్పంచ్​ అభ్యర్థుల వరాల జల్లులు

Panchayat Elections | గెలిస్తే ఉచిత వైఫై.. సర్పంచ్​ అభ్యర్థుల వరాల జల్లులు

సర్పంచ్​ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సందడి నెలకొంది. అభ్యర్థులు గెలుపు కోసం ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panchayat Elections | పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మరో ఐదు రోజుల్లో తొలి విడత పోలింగ్​ జరగనుంది. దీంతో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను మించి హామీల వర్షం కురిపిస్తున్నారు.

సర్పంచ్​ ఎన్నికల (Sarpanch Election) నేపథ్యంలో గ్రామాల్లో సందడి నెలకొంది. తొలి విడత పోటీకి సంబంధించి గుర్తులు ఖరారు కావడంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. తమను గెలిపిస్తే పలనా పని చేస్తామని హామీలు ఇస్తున్నారు. ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. గ్రామాల్లో బోర్లు వేయిస్తామని, ఆలయాలకు డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. పలువురు బాండ్​ పేపర్లు సైతం రాసి ఇస్తుండటం గమనార్హం.

Panchayat Elections | గెలిపిస్తే ఉచిత వైఫై..

తనను సర్పంచ్​గా గెలిపిస్తే ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తానని ఓ అభ్యర్థి హామీ ఇచ్చాడు. ములుగు జిల్లా (Mulugu District) ఏటూరు నాగారంలో బీజేపీ మద్దుతుతో వినుకొళ్ల ధనలక్ష్మి పోటీ చేస్తున్నారు. దీంతో తన భార్యను గెలిపిస్తే వైఫైతో పాటు ఫ్రీగా తెలుగు ఛానల్స్ ఇస్తామని స్టాంపు పేపర్ రాసి ధనలక్ష్మి భర్త చక్రవర్తి ఓట్లు అడుగుతున్నాడు.

Panchayat Elections | ఫ్రీగా కటింగ్​ చేస్తా

తన భార్యని వార్డు మెంబెర్ (Ward Member)​గా గెలిపిస్తే ఐదేళ్ల పాటు ప్రజలకు ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేస్తానని ఓ అభ్యర్థి భర్త హామీ ఇచ్చాడు. సిద్దిపేట జిల్లా (Siddipet District) దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో వార్డు మెంబర్ అభ్యర్థి భర్త వినూత్న ప్రచారం చేస్తున్నారు. తనను భార్యను గెలిపిస్తే వార్డు ప్రజలకు ఉచితంగా కటింగ్​ చేస్తానని చెప్పాడు.

హనుమకొండ జిల్లా నేరెళ్లలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో సర్పంచ్​ అభ్యర్థులు ఓట్ల కోసం తమ అనుచరులతో ఎలుగుబంటి, చింపాంజీ వేశాలు వేయించారు. వారితో కోతులను తరిమిస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామంలో కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Panchayat Elections | ఆడపిల్ల పుడితే రూ.రెండు వేలు

మెదక్ జిల్లా (Medak District) హవేలీ ఘన్​పూర్ మండలం కప్రాయిపల్లి సర్పంచ్​గా బీఆర్​ఎస్​ మద్దతుతో కుక్కల మౌనిక పోటీ చేస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే రూ.2 వేలు ఇస్తానని హామీ ఇచ్చింది. తీజ్ పండుగకు రూ.20 వేలు, ముదిరాజ్ బోనాలకు రూ.8 వేలు, ఎల్లమ్మ బోనాలకు రూ.3 వేలు, గ్రామంలో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఇస్తానని హామీ ఇచ్చింది.

Must Read
Related News