అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Woman Cycle Ride | ప్రస్తుత రోజుల్లో పని ఒత్తిడి, వేగవంతమైన జీవనశైలి కారణంగా చాలా మంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్న విషయం మనందరికి తెలిసిందే. రోజువారీ హడావిడిలోంచి బయటపడేందుకు వారు వీకెండ్‌లను తమ అభిరుచులకు కేటాయిస్తూ రిలీఫ్ పొందడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు.
ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రశాంతంగా సైకిల్ తొక్కాలని చాలామంది కోరుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద నగరాల్లో అందుకు అనువైన సైకిల్ ట్రాక్‌లు చాలా తక్కువగా ఉండడం పెద్ద సమస్యగానే మారింది. సైకిలింగ్‌కు (Cycling) అత్యంత అనుకూలమైన నగరాలుగా విజయవాడ, మచిలీపట్నం పేర్లు ముందుకు వస్తాయి.
Woman Cycle Ride | అర్ధరాత్రి సైకిల్ రైడ్..
ఈ రెండు నగరాల్లో ఎక్కడా కొండలు, గుట్టలు, ఎత్తుపల్లాలు ఉండవు. నగరంలోని ఒక చివర నుంచి మరో చివర వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సైకిల్ తొక్కుతూ వెళ్లిపోయే వీలుంది. అయితే ఇంత అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రెండు నగరాల్లో ఒక్క సైకిల్ ట్రాక్ కూడా లేకపోవడం గమనార్హం. అయితే తాజాగా హైదరాబాద్‌లో (Hyderabad) అర్ధరాత్రి అందాలను ఆస్వాదిస్తూ, గచ్చిబౌలి సమీపంలోని సైకిల్ ట్రాక్‌లపై సైకిల్ రైడ్ చేసిన ఓ యువతి సోషల్ మీడియాలో (Social Media) పోస్టు చేసింది. రాత్రి 2 గంటలకు తొలిసారి ఈ రైడ్ చేసిన అనుభవాన్ని ఆమె షేర్ చేస్తూ పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
తన పోస్టులో యువతి.. అర్ధరాత్రి సైకిల్ తొక్కడమే ఒక ప్రత్యేకమైన అనుభూతి అని, ఆ సమయంలో వాతావరణం అద్భుతంగా ఉందని, రోడ్లు ఖాళీగా ఉండడంతో పూర్తి ఫ్రీడమ్‌గా రైడ్‌ను ఎంజాయ్ చేశానని సంతోషంగా వివరించింది. ఆమె షేర్ చేసిన వీడియోలో గచ్చిబౌలి (Gachibowli) సైకిల్ ట్రాక్ ప్రశాంతంగా, లైట్లు మెరిసే తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టు వైరల్ కావడంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. చాలామంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఈ వీడియోలో ప్రతిఫలిస్తున్న సామాజిక భద్రతపై చర్చిస్తున్నారు. మహిళలు అర్ధరాత్రి ఇలా స్వేచ్ఛగా తిరగగలగడం గాంధీజీ ఊహించిన అసలైన స్వాతంత్య్రం అని కామెంట్ చేస్తున్నారు. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో రాత్రిపూట కూడా పహారా పెరిగిన విషయం తెలిసిందే. ఈ చర్యల వల్ల యువతులు రాత్రి వేళల్లో కూడా నిర్భయంగా తిరగగులుగుతున్నారని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
