Homeఆంధప్రదేశ్Free Bus | పురుషుల‌కి గుడ్ న్యూస్‌.. ఇక మ‌హిళ‌ల‌తో పాటుగా ఉచిత ప్ర‌యాణం

Free Bus | పురుషుల‌కి గుడ్ న్యూస్‌.. ఇక మ‌హిళ‌ల‌తో పాటుగా ఉచిత ప్ర‌యాణం

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకు 50% రాయితీతో ప్రయాణిస్తున్న వీరికి, ఇకపై ఏ విధమైన ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదం కానుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Free Bus | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దివ్యాంగులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన తర్వాత, ప్రభుత్వ విభాగాలు ఈ పథకం అమలులోకి రావడానికి అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేశాయి.

ఈ నిర్ణయం అమలు అయితే దాదాపు 2 లక్షల మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం దివ్యాంగులు ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసుల్లో టికెట్ ధరపై 50% రాయితీ పొందుతున్నారు. నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సు (Ordinary Bus)ల్లో ఉచిత ప్రయాణం ఇప్పటికే అమలులో ఉంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని దివ్యాంగులకు కూడా చార్జీలేని ప్రయాణం అందుబాటులోకి రానుంది.

Free Bus | పథకం అమలు కోసం ఆర్టీసీ లెక్కలు సిద్ధం

ఈ ఉచిత ప్రయాణ పథకం అమలుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు విస్తృతమైన వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి రాయితీ రూపంలో ఎంత మొత్తం పరిహారం చెల్లించాల్సి వస్తుందో లెక్కలు వేసే ప్రక్రియ కొనసాగుతోంది.రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారు: 7.68 లక్షలు,వీరిలో బస్సు పాస్‌లను ఉపయోగిస్తున్న వారు: సుమారు 2 లక్షలు. దివ్యాంగ పాస్‌లపై ప్రస్తుతం ఆర్టీసీ భరిస్తున్న ఆర్థిక భారం: ఏటా రూ.188 కోట్లు. ఈ వివరాలను ఆధారంగా చేసుకొని ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు విధానంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నాలుగు రకాల దివ్యాంగుల పాస్‌లు ఇస్తుంది. 100% వినికిడి లోపం, 100% అంధత్వం, 69% కంటే తక్కువ IQతో మానసిక వైకల్యం, 40% కంటే ఎక్కువ శారీరక వైకల్యం..ఈ కేటగిరీలో ఉన్న వారికి పాస్‌లు ఇస్తోంది. ఆగస్టు 15 నుంచి దివ్యాంగులైన మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు పురుషులకు కూడా ఈ పథకాన్ని విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సు పాస్‌ (Bus Pass)లు పొందే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. లెక్కలు పూర్తయ్యాక ఈ పథకం ప్రారంభ తేదీపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల రవాణాకు ఒక పెద్ద ఉపశమనంగా నిలవనుందని అధికారులు చెబుతున్నారు.

Must Read
Related News