అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామ (Mamidipalli village) శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ (Armoor SHO Satyanarayana) తెలిపారు. వారి నుంచి రూ.11,500 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా పేకాట ఆడితే తమకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
