అక్షరటుడే, కమ్మర్‌పల్లి: Kammarpally | మండలంలోని ఉప్లూర్ శ్రీ షిర్డీ సాయి దేవాలయంలో (Uplur Sri Shirdi Sai Temple) పలు అభివృద్ధి పనులకు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంటశాల, భక్తుల సౌకర్యార్థం మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.
అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ (Temple Development Committee) సభ్యులు మాట్లాడుతూ.. భక్తులు అందించిన విరాళాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం పౌర్ణమి సందర్భంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పోలేపల్లి లచ్చయ్య, బద్దం గంగారెడ్డి, యెనుగందుల శశిధర్, పెంబర్తి నరేష్ కుమార్, పోతు మురళి, పోతు గణేష్, మహిళా సంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.