Congress Nizamabad | నగరంలో రూ.60 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Nizamabad | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) పరిధిలోని 60 డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం రూ.60 కోట్ల నిధులతో పనులు చేపట్టినట్లు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​ అలీ (Shabbir Ali), పీసీసీ చీఫ్​ (PCC Chief), ఎమ్మెల్సీ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​(Bomma Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. Congress Nizamabad | డివిజన్​కు రూ.కోటి.. నిజామాబాద్​ […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Nizamabad | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) పరిధిలోని 60 డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం రూ.60 కోట్ల నిధులతో పనులు చేపట్టినట్లు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​ అలీ (Shabbir Ali), పీసీసీ చీఫ్​ (PCC Chief), ఎమ్మెల్సీ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​(Bomma Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Congress Nizamabad | డివిజన్​కు రూ.కోటి..

నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ఉన్న 6‌‌0 డివిజన్లలో ఒక్కో డివిజన్​కు రూ.కోటి చొప్పున కేటాయిస్తున్నామని షబ్బీర్​ అలీ ​ పేర్కొన్నారు. దీంతో నగర రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

Congress Nizamabad | సబ్​స్టేషన్​ నిర్మాణం..

నగరంలో విద్యుత్​ సమస్య రాకుండా ఉండేందుకు రూ. 6 కోట్లతో 33/11 కేవీ సబ్​ స్టేషన్​ను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు తెలిపారు. నగర ప్రజలకు విద్యుత్​ అంతరాయం ఏర్పడకుండా కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ అభివృద్ధిని చూసి కార్పొరేషన్​ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటెయ్యాలని కోరారు.

Congress Nizamabad | అంతర్గత రోడ్లు.. డ్రెయినేజీ వ్యవస్థ..

నగరంలో మౌలిక సదుపాయాలు, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రోడ్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. తమది గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని, నగరాన్ని ఒక ‘మోడల్ సిటీ’గా తీర్చిదిద్దే బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని ఆయన అన్నారు.

Congress Nizamabad | నిజామాబాద్​ గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగరాలి..

పీసీసీ అధ్యక్షుడు మహేష్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే మా సంకల్పం అని పేర్కొన్నారు. రూ.60 కోట్లు అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Congress Nizamabad | అవినీతి రహిత పాలన అందిస్తాం

గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కంటే, పారదర్శకమైన, వేగవంతమైన పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని మహేశ్​ కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. తాము చేస్తున్న ఈ రూ.60 కోట్ల అభివృద్ధి పనులే మన విజయానికి పునాది అని పేర్కొంటూ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, నుడా ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ, అరికెల నర్సారెడ్డి, నరాల రత్నాకర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...