అక్షరటుడే, ఎల్లారెడ్డి: Former MLA Nallamudugu Surender | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావును సిట్ విచారించడాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. హరీష్‌రావ్‌కు సిట్ నోటీసులు ఇచ్చి విచారించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Former MLA Nallamudugu Surender | ఉద్యమ నాయకులు భయపడరు..
ఉద్యమ నాయకులు ఎప్పుడు కూడా విచారణలకు, అరెస్టులకు భయపడరని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ సురేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్దే ధ్యేయంగా ఎన్నో ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గులాబీ సైనికుడు ప్రజల పక్షాన అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు. పోరాటాలు తమకేం కొత్త కాదని, కేవలం రేవంత్‌రెడ్డి బావ మరిది టెండర్ల గుట్టు రట్టు చేసినందుకే హరీష్‌రావుపై కక్షకట్టారని ఆయన ఆరోపించారు.
కేవలం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాత్రమే ఈ నోటీసుల నాటకమాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.