అక్షరటుడే, వెబ్‌డెస్క్: Former MLA Jeevan Reddy | కాంగ్రెస్ నేత, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఆర్మూర్ పట్టణంలో డివైడర్ పెంచుతున్న మొక్కలు, చెట్లను నరకడాన్ని తప్పుబట్టారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR కోట్లు పెట్టి నిర్మించిన డివైడర్‌పై, పదేళ్లుగా తాము పెంచిన 400 చెట్లను అక్రమంగా నరికేశారని దుయ్యబట్టారు. ఇదెక్కడి అరాచకం అని ప్రశ్నించారు.
Former MLA Jeevan Reddy | ఏం అధికారం ఉందని..
కేవలం పైసా వసూల్ రెడ్డి ఫొటోలు ఉన్న 300 బోర్డులు పెట్టుకోవడానికి పర్యావరణాన్ని నాశనం చేస్తారా.. ఇదేనా ఆర్మూర్ ప్రజలకు ఇచ్చే సందేశం..? అని నిలదీశారు.
ఏ అధికారం ఉందని ఈ పని చేశారు..? మున్సిపల్ కమిషనర్‌వా? సర్పంచ్‌వా? కౌన్సిలర్‌వా? చెట్లను నరకడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.
నరికించిన చేతులతోనే చెట్లను తిరిగి నాటాలని డిమాండ్ చేశారు. లేదంటే, ఆర్మూర్ ప్రజలందరినీ ఏకం చేసి, ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం ఎలాగో చూపిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సదరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇన్‌స్టాలో పోస్టు చేశారు.
