అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత(Kavitha) మధ్య అంతర్యుద్ధం మరోసారి బయటపడింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TGBKS) ఇంఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కేటీఆర్ బాధ్యతలు కట్టబెట్టారు.
తెలంగాణ భవన్లో బుధవారం (జులై 16) బొగ్గు గని కార్మిక సంఘం నేతలు సమావేశమయ్యారు. ఇందులో పలు తీర్మానాలు చేశారు. ఇందులో బీఆర్ఎస్ కు అనుబంధంగానే కార్మిక సంఘం పనిచేయాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సంఘం బాధ్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించారు.
Koppula Eshwar | ఇప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలిగా కవిత..
TGBKSకు ఇంతవరకు ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ వచ్చారు. కానీ, సంఘం వేరొకరికి కట్టబెట్టడం ద్వారా కవితకు కేటీఆర్ షాక్ ఇచ్చారు. కార్మిక సంఘం బాధ్యతలను కవిత నుంచి లాగేసుకోవడం ద్వారా కేటీఆర్, కవితల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం బయటపడింది. కాగా, TBGKS నుంచి కవితకు ఉద్వాసన పలకడం భారాస శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Koppula Eshwar | నోరు మెదపని నేతలు..
గత కొంతకాలంగా కవిత కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు ప్రచారంలో ఉంది. దీనిపై ఇంత వరకు ఎవరూ నోరు మెదపలేదు. గులాబీ శ్రేణులు కూడా పెదవి విప్పడం లేదు. తీన్మార్ మల్లన్న ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలపైనా భారాస నాయకులు సైలెంట్‌గా ఉండటం గమనార్హం.
ఇలాంటి తరుణంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి కవితను దూరం పెట్టడంపై రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది. ఈ చర్యతో ఇరువురి మధ్య దూరం పెరిగి, అంతర్గత గొడవలకు దారితీయొచ్చని తెలుస్తోంది.
ఇటీవల ఎమ్మెల్సీ కవిత చర్యలు గులాబీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కానీ, బహిరంగంగా ఎవరూ నోరు మెదపలేదు.

Koppula Eshwar | ఏమి నిర్ణయాలు తీసుకున్నారంటే..
తెలంగాణ భవన్లో జరిగిన సంఘం సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి అనుబంధంగా కార్మిక సంఘం అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కోసం పార్టీ తరఫున ఇన్‌ఛార్జిగా ఇకపై బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారని కేటీఆర్ ప్రకటించారు.
సింగరేణి Singareni కార్మికులకు కాంగ్రెస్ Congress ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు సర్కారుపై ప్రజాక్షేత్రంతో పాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ BRS ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి సంస్థ కోసం చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు.