అక్షరటుడే, నిజాంసాగర్: Ex MLA Hanmanth Shinde | జుక్కల్ (jukkal) నియోజకవర్గంలో గురువారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలను గురువారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుంద (Bichkunda) పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బిచ్కుందలోని క్యాంప్ కార్యాలయంలో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
అనంతరం బిచ్కుంద నుంచి ర్యాలీగా జుక్కల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పిట్లం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్లతో ర్యాలీగా నిజాంసాగర్ మండలంలోని అంజనాద్రి క్షేత్రం (Anjanadri Kshetram) వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ దఫేదార్ రాజుతో (Daphedar Raju) కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దఫేదార్ రాజు సమక్షంలో కేక్ కట్ చేశారు.
అనంతరం నిజాంసాగర్ మండల మాజీ ఎంపీపీ దుర్గారెడ్డి అంజనాద్రి ఆలయ ధర్మకర్త కిషోర్ కుమార్, సొసైటీ ఛైర్మన్లు నరసింహారెడ్డి, వాజిద్ అలీ, కళ్యాణి, విఠల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి నిజాంసాగర్ మండల నాయకులు మనోహర్ రమేష్ గౌడ్, గంగారెడ్డి సత్యనారాయణ విఠల్, పిట్లం మండల నాయకులు వాసరి రమేష్, వెంకట్రాంరెడ్డి, ప్రతాపరెడ్డి, విజయ్, నర్సాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి సైతం హన్మంత్ సింధేకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
పెద్ద కొడప్గల్, మండల నాయకులు ప్రతాపరెడ్డి జుక్కల్ మండల నాయకులు నీలూ పటేల్, గంగాధర్, బిచ్కుంద మండల నాయకులు హన్మాండ్లు సేట్, గంగాధర్, రాజు పటేల్, మద్నూర్ మండల నాయకులు విజయ్ మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన నాయకులు అభిమానులు గ్రామాల వారీగా ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సన్మానించారు.
అంజనాద్రి క్షేత్రంలో పూజలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే