అక్షర టుడే, వెబ్ డెస్క్: Bheemgal Mandal | మండలంలోని చేంగల్ గ్రామ (Chengal village) మాజీ ఉపసర్పంచ్ శోభన్ ఆయన సతీమణి, బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు లావణ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ మేరకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ (Congress constituency in-charge Mutyala Sunil Kumar) సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేసి పార్టీని మరింత పటిష్టం చేయాలని సునీల్ రెడ్డి వారికి సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, డీసీసీ కార్యదర్శి రమేష్, నర్సయ్య, జీవన్, దేవేందర్, అనంతరావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.