అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Food Poisoning | గద్వాల జిల్లా (Gadwal District) కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు.
హాస్టల్లో విద్యార్థులు (Hostel Students) మంగళవారం ఉదయం టిఫిన్ చేశారు. అనంతరం పాఠశాలకు వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే 15 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ.. ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయన్నారు. వార్డెన్‌కు చెప్పడంతో పారవేశారన్నారు. అనంతరం అరటిపళ్లు, బిస్కెట్లు తిని స్కూల్‌కి వెళ్లామన్నారు. ఈ క్రమంతో కడుపునొప్పి, వాంతులైనట్లు చెబుతున్నారు.
Food Poisoning | కవిత ఆగ్రహం
ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు ఆవేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) చేతగానితనానికి నిదర్శమన్నారు. పేదింటి బిడ్డలంటే కాంగ్రెస్‌కు లెక్క లేదని విమర్శించారు. విద్యా శాఖ స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నా వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
