అక్షరటుడే, ఎల్లారెడ్డి : Food Poisoning | పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగిరెడ్డి పేట (Nagireddy Peta) మండల మాల్తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.
Food Poisoning | చికిత్స నిమిత్తం ఆస్పత్రికి..
భోజనం చేశాక తీవ్రంగా వాంతులు చేసుకోవడంతో స్పందించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి (Yellareddy Government Hospital) తరలించారు. ఆస్పత్రిలో ప్రస్తుతం విద్యార్థులకు వైద్యం అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆర్డీవో పార్థసింహారెడ్డి (RDO Parthasimha Reddy) పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.