అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka DGP | కర్ణాటక డీజీపీ రామచంద్రరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ (పౌర హక్కుల అమలు) కె. రామచంద్రరావు అభ్యంతరకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సోమవారం సోషల్ మీడియా (Social Media)లో అనేక వీడియో క్లిప్‌లు వైరల్ అయ్యాయి. రామచంద్రరావు వివిధ మహిళలతో అశ్లీల చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలు రాజకీయంగా కలకలం రేపాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సిద్ధరామయ్య ప్రభుత్వం (Siddaramaiah Government) వెంటనే సస్పెండ్ చేయాలని నిర్ణయించింది.
Karnataka DGP | డీజీపీపై ఆగ్రహం
డీజీపీ రామచంద్రరావు (DGP Ramachandra Rao) తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించాడని పేర్కొంది. దర్యాప్తు జరిగే వరకు తక్షణమే అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. సస్పెన్షన్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వెళ్లొద్దని ఆదేశించింది. కాగా ఈ వ్యవహారంపై సీఎం సిద్దరామయ్య (CM Siddaramaiah) సోమవారం స్పందించిన విషయం తెలిసిందే. అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, పోలీసు అధికారి ఎంత సీనియర్ అయినా చట్టానికి అతీతులు కారన్నారు. అనంతరం ఆయనపై వేటు వేశారు.
ఈ వీడియోలపై రామచంద్రరావు సోమవారం సాయంత్రం స్పందించారు. అవి నకిలీవని తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వీడియో నిజం కాదన్నారు. అవి ఏఐతో చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం మంత్రిని కలిసి మాట్లాడారు.