అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Municipal Elections | రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగనుంది. సంక్రాంతి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికలకు సమాయత్తం అవుతోంది.
రాష్ట్రంలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం పూర్తయి దాదాపు ఏడాది అవుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) నిర్వహించిన ప్రభుత్వం.. తాజాగా పురపోరుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా మున్సిపాలిటీల్లో గత వారం రోజులుగా అభివృద్ధి పనులకు జోరుగా శంకుస్థాపనలు చేస్తున్నారు. సీఎం సైతం జిల్లాల్లో పర్యటించనున్నారు.
Municipal Elections | మూడు జిల్లాల్లో..
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్మల్, మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభల్లో ప్రసగింస్తారు. అనంతరం 18న రాత్రి మేడారంలో సీఎం బస చేస్తారు. మేడారం జాతర అభివృద్ధి పనులను ఈ నెల 19న ప్రారంభించనున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల సమయంలో సైతం సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల్లో పర్యటించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆయన పర్యటించనున్నారు. మెజారిటీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
Municipal Elections | దావోస్‌కు రేవంత్
సీఎం రేవంత్‌రెడ్డి మేడారం జాతర (Medaram Jatara) పనులు ప్రారంభించిన అనంతరం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 19న మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన బయలుదేరుతారు. 20 నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారు. అనంతరం 24న దావోస్ నుంచి యూఎస్‌కు వెళ్తారు. ఫిబ్రవరి 1న ఆయన తిరిగి హైదరబాద్ (Hyderabad) వస్తారు. కాగా ఆ లోపు మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర సాగనుంది. అధికారులు, పోలీసులు జాతరలో బిజిగా ఉంటారు. దీంతో జాతర అనంతరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.