అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డిలో (kamareddy) పూల వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నిజాంసాగర్ చౌరస్తా (Nizamsagar Chowrastha) వద్ద కామాక్షి సూపర్ మార్కెట్లో (Supar market) పూలు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సూపర్ మార్కెట్ ముందు వారు సుమారు గంటన్నర పాటు ఆందోళన చేపట్టారు.
మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు పూలు విక్రయిస్తూ తమకు గిరాకీ రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సూపర్‌మార్కెట్‌కు మద్దతుగా ఇతర వ్యాపారులు ఘటనాస్థలానికి వచ్చి వారికి మద్దతు తెలిపారు.
వ్యాపారం అన్నాక అన్నిరకాల విక్రయాలు ఉంటాయని.. పూలు విక్రయిస్తే తప్పేమిటని.. వారు ఆందోళన చేస్తున్న వారిని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ నరహరి అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం షాప్ ఎదుట ఆందోళన చేయవద్దని, ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో అక్కడినుంచి ఇరువర్గాలు వెళ్లిపోయాయి.